6 March, 2026 | 10:32 AM

క్షేత్రస్థాయిలో పథకాల తీరును మెరుగుపర్చాలి

06-03-2026 12:00 AM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

ఆదిలాబాద్, మార్చి ౫ (విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాదని తెలిపారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ పై మండల, జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ ప్రత్యేక అవగాహన, సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అంతకుముందు జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని విభాగాల వారీ గా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తుల క్రోడీకరణ, అర్హుల ఎంపికలో పారదర్శకతతో చేపట్టలన్నారు. విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాల ని, అభివృద్ధి పను ల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలనీ, మండల, జిల్లా స్థాయి అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేసి, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలన్నారు.

సం క్షేమ పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలనీ, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, జెడ్పి సీఈవో రవీందర్, ఎంపీడీవో లు, తహశీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.