1 July, 2026 | 11:15 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

చెట్ల నరికివేతపై తనిఖీ కేసు నమోదు

09-04-2025 01:21 AM

తలకొండపల్లి,ఏప్రిల్ 08:ప్రభుత్వ భూమిలో చెట్లు నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న విషయం ఫిర్యాదు రావడంతో సంబందిత అదికారులు తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసిన సంఘటన చుక్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెలితే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామ శివారులో కలికిదోన వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది.ఈ దేవాలయానికి అప్పటి వనపర్తి రాజ వంశస్తులు వివిద ప్రాంతాలలో సుమారు 180 ఎకరాల భూ ములు ఇచ్చారు.

అదేవిదంగా చుక్కాపూర్ గ్రామంలో 110 ఎకరాలు దేవాలయం పేరిట దేవాదాయశాఖలో నమోదై ఉంది. దేవాలయంలో పుజారులుగా సిద్దాంతి పట్టాభిరామశర్మ, అతని కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు.వారి ఆదీనంలొనే దేవాలయ భూములు ఉన్నాయి.ఐతే  దేవాలయ భూ మి సర్వే నెంబరు 75 లో ఎపుగా పెరిగ చేట్లను ఇటీవల కొందరు నరికి వేస్తున్నట్లు గ్రామాస్తులు సంబందిత అదికారులకు ఫిర్యాదు చేశారు.మళ్లీ రెండు రోజులుగా చెట్లను నరకడం మొదలుపెట్టారు.విషయాన్ని గ్రామస్తులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెల్లారు.స్పందించిన రెవెన్యూ,అటవీ శాఖ అధికారులైన ఆర్‌ఐ మంజుల,ఆమనగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్,వనసంరక్షణ అదికారులతో కలిసి మంగళవారం సంఘటన స్తలాన్ని పరిశీలించి చెట్ల నరికివేత వివరాలను సేకరించారు.

ఇందులో 11వేప 1తుమ్మ  చెట్లను నరికినట్లు గుర్తించి సంబందిత వ్యక్తులపై కేసు నమోదు చేసి అటవీ శాఖ డివిజనల్ అదికారులకు  నివేదించినట్లు ఆమనగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్ వివరించారు. ఆలయ పుజారి వాల్టా చట్టాన్ని దిక్కరించి చెట్లను నరికి వేసి అమ్ముకోవడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.సమగ్ర విచారణ చేసి చెట్లు నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అదికారులను కోరుతున్నారు.