13 April, 2026 | 5:16 AM

రాష్ట్రస్థాయిలో జాగృతి ప్రభజనం

13-04-2026 03:34 AM

వనపర్తి, ఏప్రిల్ 12(విజయక్రాంతి): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో జాగృతి కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో మరొ కసారి ప్రభంజనం సృష్టించారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో హెచ్. అనూష 1000 మార్కులకు 994, ఎన్. అర్చన 993, ఎంపీసీ విభాగంలో కె.అ పూర్వ 1000 మార్కులకు గాను 992, త్యాగరాజు 992, ఇందు 991, పి. లావ ణ్య 990, ఎంఈసిలో యశ్వంత్ 965,  సిఈసిలో ఎం. శ్రీలత 954 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులతో విజయఢంకా మో గించారు.

మొదటి  సంవత్సరం బైపీసీలో ఉజ్మా హజారా 440 మార్కులకు గాను 438 రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ మా ర్కులను సాధించి మరొకసారి వనపర్తి జిల్లా లో సత్తా చాటారు. అదేవిధంగా ఎం. హరీష్ 437, ఎస్. స్వప్న 437, ఎం. అశ్విని 435, ఎంపీసీలో 470 మార్కులకు గాను కె.హేమలత 466, ఎస్. గాయత్రి 466, ఎ. సాయిచ రణ్ తేజ 465 రాష్ట్రస్థాయి ర్యాంకులు సా ధించి ప్రభంజనం సృష్టించారు. ఎంఈసి విభాగంలో శ్రావణ్ కుమార్ 460, 1 సిఈసిలో డి.ప్రణిత 491, వి.శ్రావణి -482 మా ర్కులతో ఉమ్మడి జిల్లా టాపర్లుగా నిలిచారని కళాశాల యాజమాన్యం ప్రకటించింది.

రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సా ధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ అంబటి వినేష్ కుమార్, యజమాన్య సభ్యులు భాస్కర్, శ్యామ్ కుమార్, సత్యనారాయణలు బొకె, శాలువలతో సత్కరించి మెమోంటోలను అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడు తూ సాధారణ విద్యార్థులతో కార్పొరేట్ స్థాయి మార్కులతో, స్టేట్ ర్యాంకులను, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఫస్ట్ ర్యాంకులను సాధిస్తూ ఉమ్మడి జిల్లాలో సంచలనాలు సృష్టిస్తున్న ఏకైక కళాశాల జాగృతి కళాశాల అని తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యజమాన్య సభ్యులు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.