ఇంటర్ ఫలితాల్లో ‘రెసోనెన్స్’ ప్రభంజనం
టాప్ 5లో 345, టాప్10లో 780 మంది విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 2026: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు- ఫలితాలలో ‘రెసోనెన్స్ జూనియర్ కళాశాల’ విద్యార్థులు ప్ర భంజనం సృష్టించారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు కైవ సం చేసుకున్నారు. స్టేట్ టాప్ 345, టాప్ 780 మంది విద్యార్థులు ర్యాం కులు సాధించారు. సీనియర్ ఇంటర్‌లో రేవంత్ వంగల (994/1000), షేక్ ఐరా జాసియా (995/1000)తో టాపర్లుగా నిలిచారు.
కఠోరశ్రమ, అంకితభావం, క్రమశిక్షణ తో కూడిన ప్రిపరేషన్‌తో రెసోనెన్స్‌కు గర్వకారణంగా నిలిచారు. కళాశాల పటిష్టమైన విద్యా విధానం, నిపుణులైన అధ్యాపకుల మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహానికి ఈ ఫలితాలు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ఈ సందర్భంగా ‘రెసోనెన్స్’ విద్యా సంస్థల మేనేజింగ్ డైరె క్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ.. ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచా రన్నారు.
ఈ విజయాలు విద్యార్థుల కృషికి, అధ్యాపకుల అంకితభావానికి, కళాశాలపై తల్లిదండ్రులకు ఉన్న నమ్మకానికి ప్రతిబింబమన్నారు. మొదటిరోజు నుంచే అటు బోర్డు పరీక్షలకు, ఇటు పోటీ పరీక్షలకు సమాన ప్రా ధాన్యత ఇస్తూ విద్యార్థులు బలమైన పునాదులతో సంపూర్ణ విజయాన్ని అందుకునేలా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో రాణించిన ప్రతి విద్యార్థికి డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా అభినందనలు తెలిపారు.
ఎంపీసీ, బైపీసీల్లో ర్యాంకుల పంట..
జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కావ్యశ్రీ సవరద్, మీర్జా ఇబ్రహీం అహ్మద్, కనుకుల సస్యరెడ్డి, ఏ. నాగసాయి, హిమేష్, ముక్కామల్ల జ్ఞానేశ్వరి, దేశెట్టి సరయు, నక్షత్ర, మాలే భావిక, మడపాటి సాహితీ, మేగవత్ వసుంధర, మర్రి జయచంద్ర, సిం గు ఇందుశ్రీ, పరెళ్ల బాలత్రిపుర, దారెడ్డి హన్సిక, బి.రాజేందర్, బాలే శ్రీధర్, ఏ. నాగార్జునరెడ్డి, బెలుగురీ శ్రీనివాసులు 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచి సత్తాచాటారు.
జూనియర్ ఇంటర్‌లో బైపీసీ విభాగంలో ఆకుల సాయిశివ, లాస్య, గెడ్డ ధీరజ్ కుమార్, వరాల దుర్గ అంజలి, పొన్నూరి హిమద్యుతి, ఎర్వ అక్షయ, ధమ్మన్న స్నేతిక రెడ్డి, కాశ్వి సర్వే, ప్రణవి మిర్యాల 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచి సత్తాచాటారు.




