10-02-2026 12:00:00 AM
కార్పొరేషన్ వ్యాప్తంగా హోరెత్తిన ప్రచారం
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9, (విజయక్రాంతి): కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు అయిన సోమవారం ప్రచారం హోరెత్తింది. ర్యాలీలు, కార్నర్ మీటింగుల తో మైకుల మూతతో మారుమోగింది . అధికార కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, బిఆర్‌ఎస్ పార్టీలో హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించాయి. అభ్యర్థులు సైతం ఆఖరి రోజు కావడంతో ప్రతి ఇంటిని తట్టి ఓటర్ ను కలసి ఓటు కోసం అభ్యర్థించారు.
కాంగ్రెస్ తోనే అభివృద్ధి :ఎంపీ రఘురామిరెడ్డి, మంత్రి పొంగులేటి.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని లక్ష్యంతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామ్ సహాయం రఘురామిరెడ్డి డివిజన్లో వారేగా కార్నర్ మీటింగులు నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కార్పొరేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంటూ హామీలు గుప్పించారు. బిఆర్‌ఎస్, సిపిఐ అభ్యర్థులకు ఓట్లు వేస్తే ఒరిగేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పా లని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సభలో సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ 26 నెలల పాలనలో అభివృద్ధి పూర్తిగా అడుగంటి పోయిందని సంక్షేమ కార్యక్రమాల జాడే లేదని విమర్శించారు. కార్పొరేషన్లు బీఆర్‌ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కార్పొరేషన్ పై ఎర్రజెండా ఎగరవేయాలి: సాంబశివరావు
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు శక్తివంతులని లేకుండా కృషి చేశానని కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు అన్నారు. ఎస్బిఐ బలపరుస్తున్న అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27 సంవత్సరాల పాటు ఎన్నికలకు దూరంగా ఉన్న పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు తెచ్చిన ఘనత సిపిఐ పార్టీదే అన్నారు. కార్పొరేషన్ లో ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడెం చెయ్ సిపిఐ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కార్పొరేష్ప ఎర్రజెండాను ఎగరవేయాలని కోరారు.
మూగబోయిన మైకులు..
సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి బ్రేక్ పడింది. గత వారం రోజులుగా వాడవాడల మైకులతో హోరెత్తించిన శబ్దాలు ఒక్కసారేగా మూగబోయాయి. ఎన్నికల నియమావళి ప్రకారం 24 గంటల ముందుగానే ప్రచారానికి తెరపడాల్సి ఉంది.