15 June, 2026 | 9:01 PM

Breaking News

ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •   విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •  

నూతన సర్పంచులకు ఘన సన్మానం

10-02-2026 12:00 AM

బూర్గంపాడు, ఫిబ్రవరి9, (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామంలో ఏఐటీయూసీ కార్యాలయం నందు నూతనంగా ఎన్నికైన సారపాక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, ముసలిమడుగు సర్పంచ్ పూనెం సురేంద్ర లను ఐఎన్ టియుసి కాంట్రాక్టు యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని విధాలుగా కార్మికులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

అదేవిధంగా జరగబోవు వేతన ఒప్పందంలో కూడా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఈ ఎస్ ఐ హాస్పిటల్ కొరకు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని కార్మికులకు అన్ని విధాలుగా తోడుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షులు ఉర్లకొండ వీరన్న, ప్రధాన కార్యదర్శి పాటి సోమిరెడ్డి , శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.