విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను శిక్షించాలి
08-06-2026 12:00 AM
ముకరంపుర, జూన్ 7 (విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహంపై నల్లగొండలో కొంద రు దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించిండాన్ని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి మరియు నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఈ కుట్రకు పాల్పడిన దుండగులను గుర్తించి క్రిమినల్ చర్యలతో పాటు కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






