21 April, 2026 | 4:46 PM

Breaking News

ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

నిర్లక్ష్యంతోనే తప్పిదం జరిగింది!

04-03-2026 12:00 AM
  1. జడ్చర్ల మార్చురీ ఘటనపై రాష్ట్ర హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్ 
  2. శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ప్రభుత్వం సీరియస్ 
  3. ఆస్పత్రి సూపరింటెండెంట్, మరో ముగ్గురు అధికారుల సస్పెన్షన్

మహబూబ్‌నగర్, మార్చి 3 (విజయక్రాంతి)/జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి మార్చురీలో శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన వైద్యులు, ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని రాష్ట్ర హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్ స్పష్టం చేశా రు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం..  విచారణ చేపట్టింది.

ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంఓ హరినాథ్, ఎంఎన్‌ఓ రవి ప్రకాష్, డ్యూటీ డాక్టర్ మునిషాలను సస్పెండ్ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ కమిషనర్ అజయ్ కుమార్ జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఘటనపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేశారు. విచారణ అనంతరం కమిషనర్ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడా రు.

ఆస్పత్రి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యతోనే తప్పిదం జరిగినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసు కుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంఓ హరినాథ్, ఎంఎన్‌ఓ రవి ప్రకాష్, డ్యూటీ డాక్టర్ మునిషాలను సస్పెండ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

విచారణ జరుగుతున్నది: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

శవమే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, అధి కారులను సస్పెండ్ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మంచి చేయాలన్న సంకల్పంతో అడుగులు వేస్తుందని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృ ష్టకరమని బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత అధికారులకు, ప్రభుత్వానికి పూ ర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు.