calender_icon.png 19 February, 2026 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మక్కల డబ్బులు జమ చేయాలి

19-02-2026 12:17:13 AM

భారతీయ కిసాన్ సంఘ్ నాయకుల డిమాండ్

తాడ్వాయి, ఫిబ్రవరి,18( విజయ క్రాంతి ): రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కల డబ్బులు ప్రభుత్వం వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భారతీయ కింఘ్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో బుధవారం భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు అందిస్తున్నామని చెప్పి రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసిందని తెలిపారు.

కానీ ఇంతవరకు రైతుల ఖాతాల్లో మక్కల డబ్బులు జమ చేయలేదని దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుల బ్యాంకు ఖాతాల్లో మక్కల డబ్బులు జమ చేయాలని కోరారు. తాడువాయిలో మక్కల ఇంకా కొనుగోలు పూర్తికాలేదని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల మక్కలు పూర్తిస్థాయిలో సేకరించాలని కోరారు.  కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు పైడి విఠల్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు కపిల్ రెడ్డి ముదాం నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.