calender_icon.png 19 February, 2026 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు అమలు చేయడంలో విఫలం

19-02-2026 12:16:57 AM

కందుకూరు, ఫిబ్రవరి 18: ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జాగృతి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన  మండ ల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 ఇస్తామని చెప్పి 26 నెలలైనా అమలు చేయకపోవడం వంచన అని మండి పడ్డారు.

వృద్ధాప్య పింఛన్ 4000, దివ్యాంగుల పింఛన్ 6000కు పెంచుతామన్న హామీ ఏమైందని నిలదీశారు. తులం బంగారం, స్కూటీల హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పింఛన్ల విషయంలో హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ప్రజలను మోసం చేయడం ప్రజా స్వామ్యానికే గొడ్డలిపెట్టు అని, తక్షణమే హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.