5 July, 2026 | 2:36 PM

సరికొత్త బాలకృష్ణను చూస్తారు

24-12-2024 12:00 AM

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగవంశీ మాట్లాడుతూ.. “‘డాకు మహారాజ్’లో సరికొత్త బాలకృష్ణను చూస్తారు. బాలకృష్ణ గారి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటిగా ఇది నిలుస్తుంది” అన్నారు.

బాబీ మాట్లాడుతూ.. “ఈ సినిమా విజువల్ గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అలాగే ఎంటర్టున్‌మెంట్, ఎమోషన్స్ ఉంటాయి” అన్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.