5 July, 2026 | 1:51 PM

చిన్నితో వచ్చేసిన డాకు

24-12-2024 12:00 AM

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్ టీజర్ ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా రెండో గీతం ‘చిన్ని’ సోమవారం విడుదలైంది.

అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ పాటకు మరింత అందం తీసుకొచ్చింది. ‘నువ్వు తే అంటే నీ ముందు తారా తీరాలే.. నువ్వు నవ్వుతుంటే అమావాస్యయినా దీపావళిగా మారాలే’ వంటి పంక్తులు కట్టి పడేశాయి. ఈ పాటను గాయకుడు విశాల్ మిశ్రా ఆలపించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.