12 March, 2026 | 8:16 AM

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న నూతన జిల్లా కలెక్టర్

09-03-2026 12:00 AM

భద్రాచలం, మార్చి 8,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం నాడు స్వామి వారి దర్శనానికి వచ్చిన ఆయనకు దేవస్థానం ఈవో దామోదర్ రావు మరియు అర్చక స్వాములు దేవస్థానం సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ముందుగా బలీపీఠం వద్ద పూజలు నిర్వహించి, గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారిని, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అర్చక స్వాములు స్వామివారి పట్టు వస్త్రాలు అందించి విశిష్టతను తెలిపి తీర్థప్రసాదాలు అందించారు.  దేవస్థానం ఈవో దామోదర్ రావు, భద్రాచలం తహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, అర్చకస్వాములు  పాల్గొన్నారు.