2 May, 2026 | 7:25 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ఆపాలి

09-03-2026 12:00 AM

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

ఇల్లందు టౌన్, మార్చి 8 (విజయక్రాంతి): ఇర్పా అమెరికా, ఇజ్రాయిల్ దాడులను వెంటనే ఆపాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఆదివారం ఇల్లందులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, నాయకులు డి.ప్రసాద్ మాట్లాడుతూ ఇర్పా దాడుల వల్ల చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు ఖండిస్తున్నా అమెరికా, ఇజ్రాయిల్ మొండివైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎండి రాసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.