పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
18-04-2026 01:33 AM
రేగోడు, ఏప్రిల్ 17: సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు, ఆస్పత్రి ఉద్యోగులు, తెలంగాణ టీజీఈ జేఏసీ పిలుపుమేరకు తాసిల్దార్ దత్త రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి, మే ఒకటి నుండి హెల్త్ కార్డులు అమలు చేయాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.






