ప్రజలే కేంద్రంగా పారదర్శకతే ధ్యేయం
- ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
- స్థానిక సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, మే 2 (విజయక్రాంతి): ప్రజలే కేంద్రంగా పారదర్శకత ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా పాలన కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు ఎం అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ‘ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక‘ నినాదంతో ముషీరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం కవాడిగూడ లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎంపీ ఎం. అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నియోజకవర్గం నోడల్ అధికారి హైదరాబాద్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి. పవన్ కుమార్, ముషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ చందన, బీసి వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీస ర్ రమేష్, మహిళా శిశు సంక్షేమ అధికారి జ్యోతి, ఇందిరాపార్కు ట్రాన్స్కో ఏడిఈ వినో ద్, శ్రీనివాస్‌లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ ఎం. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలే కేంద్రంగా పారదర్శకతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాపాలన కొన సాగుతుందన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతిహామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేస్తుందన్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలలైన కలుషిత నీటిసరఫరా ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, కలుషిత సరఫరా వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఆనారోగ్యాల బారిన పడుతున్నారని పలుమార్లు స్థానిక వాసులు అధికారులకు ఫిర్యాదు చేసినా జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పి. లక్ష్మణ్, హరికృష్ణ డివిజన్ అధ్యక్షుడు పోతరాజు భాస్కర్, అంజయ్యగౌడ్, రమేష్ యాదవ్, సాయిబాబా, చంద్రశేఖర్, గుర్రం శంకర్, అభిషేక్, సంగపాక వెంకట్, మోహినోద్దీన్, బంటారం యాదగిరి గౌడ్, బీఆర్ ఎస్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






