15 June, 2026 | 7:43 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

పెట్రో మంట

16-05-2026 01:00 AM

లీటర్‌పై రూ.3 చొప్పున పెంచిన ఆయిల్ కంపెనీలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు 

సీఎన్‌జీ వాహనదారులకూ షాకే..

కిలో సీఎన్‌జీపై రూ.2 బాదుడు 

హైదరాబాద్‌లో పెట్రోల్ 110.89, డీజిల్ రూ.98.96

న్యూఢిల్లీ, మే 15: పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రో ల్, డీజిల్ ధరలు శుక్రవారం భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.3, లీటర్ డీజిల్‌పై రూ.3 పెరిగాయి. పెట్రోల్, డీజిల్ వాహనదారులకే కాదు.. సీఎన్‌జీ వాహనదారు లకూ ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. కిలో సీఎన్‌జీపై రూ.2 చొప్పున పెంచాయి. పెరిగి న ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని ఆయిల్ కంపెనీలు వెల్లడిం చాయి.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిలోని తీవ్ర ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవాప్తంగా ము డిచమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచాయి. దీంతో అవి తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదురవడంతో లీటర్‌కు రూ.3 పెంచి వాహనదారులపై భారా న్ని మోపాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రో ల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి.


అయితే లోక్‌సభ ఎన్నికల ముందు 2024 మార్చిలో లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గించాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల భారీస్థాయిలో ప్రచారం జరిగింది. అయితే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడూ పేర్కొం టూ, వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసింది. ఈ క్రమంలో ధరలు పెరగడం గమనార్హం. అయితే ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగొచ్చనే వార్తలు దేశంలోని వాహనదారులను ఆందోళనకు గురిచే శాయి.

దీంతో పెట్రోల్ బంక్‌ల వద్ద భారీ బారులు తీరారు. కొన్ని బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టడం, మరికొన్ని బంకులను బం ద్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 చొప్పున పెంచాయి. హైదరాబాద్‌లో లీట రు పెట్రోల్ ధర ఇప్పుడు రూ.110.89 కాగా, లీటరు డీజిల్ ధర రూ.98.90గా నిర్ణయించారు. దేశంలోనే అత్యధికంగా హైదరాబా ద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.3.39, డీజిల్‌పై రూ.3.26 మేర ధరలు పెరిగాయి. పెట్రోలు ధరలు పెరగడం వల్ల ప్రయాణ ఖర్చులు, వస్తువుల ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు మొదలైన వాటిల్లో కూడా మార్పు లు చోటుచేసుకుంటాయి.