15 July, 2026 | 12:56 AM

పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సర్కిల్‌ను అందంగా తీర్చిదిద్దాలి

15-07-2026 12:56 AM

మేయర్ మూడ్ గణేష్

కొత్తగూడెం, జూలై 14 (విజయ క్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, పోస్టాఫీస్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ గతంలో ఉన్న విధంగా పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ కి, డీఈ , ఏఈ లకు సూచించారు.

సర్కిల్లోని  లైటింగ్, గ్రీనరీ, ఉద్యానవనం, ఫౌంటెన్, పరిసరాల పరిశుభ్రత, అవసరమైన మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించి, రాత్రి వేళల్లో కూడా అంబేద్కర్ విగ్రహం అందరికీ స్పష్టంగా కనిపించేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.