మహిళలు, పిల్లల రక్షణే ప్రధాన ధ్యేయం
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్27(విజయ క్రాంతి): మహిళలు,పిల్లల రక్షణే ప్రధాన ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని ఎస్పీ నితిక పంత్ అన్నారు.ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్రజలకు, బాలి కలకు, మహిళలకు, యువతకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ ఫ్లెక్సీని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి నుండి మే 6 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, భరోసా కేంద్రం సబ్ ఇన్స్పెక్టర్ దివ్య, షీ టీమ్ ఎస్త్స్ర బిక్కులాల్, షీ టీమ్, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లాంకేంద్రంలోని బస్టాండ్, ఆదర్శ క్రీడా పాఠశాలలో మండలంలోని రాజంపేట లో మహిళలు, పిల్లల రక్షణపై అవగాహన కల్పించారు. షి టీం ఎస్సై బిక్కులాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు బొజ్జిరావు, బిజుమన్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.






