వరంగల్@43 డిగ్రీల ఉష్ణోగ్రత
28-04-2026 01:07 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం ఎండ తీవ్రత అధికంగా నమోదయింది. ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండ తీవ్రతతో పగటిపూట జనం బయటకు రాలేదు. తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం, నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం అవసరమని చెబుతున్నారు.






