28 April, 2026 | 3:06 AM

ఊరురా ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

28-04-2026 01:08 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం తో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో పార్టీ గులాబీ జెండాను నేతలు ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ టిఆర్‌ఎస్ ఏర్పాటు చేసి 14 ఏళ్ల పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషిచేసి తెలంగాణను సాధించిన తర్వాత పదేళ్లపాటు ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సాగించి, ఆ దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని దిక్సూచిగా మార్చాడని కొనియాడారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి బిఆర్‌ఎస్ రావడం తధ్యమని, కెసిఆర్ స్ఫూర్తితో పార్టీ పటిష్టతకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. 

రాజస్థాన్లో ప్రత్యేక పూజలు

బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసముధ్రం మండలానికి చెందిన ఆ పార్టీ నాయకులు రాజస్థాన్ లోని పుష్కర్ లో గల గాయత్రి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఏర్పడిన పార్టీ బిఆర్‌ఎస్ అని, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలనలో దేశంలోనే అగ్రస్థానం నిలిపారని, తెలంగాణ ప్రజల సొంత పార్టీ బి ఆర్ ఎస్ అని, రాబోయే ఎన్నికల్లో బారాస పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగిపోవాలని ఆ గాయత్రి మాతను వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, వేం సంపత్ రెడ్డి, బచ్చు పరమేశ్వర్, అప్పయ్య, రేణికుంట్ల సుధాకర్, నర్సింగం వెంకటేశ్వర్లు, గోవర్ధన్  పాల్గొన్నారు.