మొక్కజొన్న కొనుగోలును వెంటనే పూర్తి చేయాలి
- మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు
- కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికల్లో బ్యానర్ ఐటమ్ కి ఇచ్చే ప్రధాన్యత రైతుకు ఇవ్వడం లేదు
- ప్రభుత్వానికి అసలు సోయి లేదు ముందు చూపు లేదు, అవగాహన లేదు
- మార్కెట్ యార్డ్ లో ఉన్న మొక్కజొన్న వెంటనే పూర్తిస్తాయిలో కొనుగోలు చేయాలి
- మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ
గద్వాల్ ఏప్రిల్ 27 : గద్వాల మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి మొక్కజొన్న కొనుగోలు వెంటనే పూర్తి చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ అన్నారు. సోమవారం గద్వాల మార్కెట్ యార్డ్ ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి మార్కెట్ యార్డ్ లో ఉన్న మొక్కజొన్న పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయా లని అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా సుమారుగా రెండు లక్షల 70 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని ,ఎకరానికి సుమారు 25 నుండి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని కాబట్టి ఎకరాకు 25 క్వింటాళ్లు మొక్కజొన్న కొనుగోలు చేయకుండా మొత్తం కొనుగోలు చేయాలన్నారు. ఎం ఎస్ పి రూ 2,400 రూపాయల ధర ఉన్న రైతులు రోజుల తరబడి పడి కాపులు కాయలేక బయట తక్కువ ధరకు మొక్కజొన్న అమ్ముకొని ఏడువందల నుంచి 800 రూపాయలు క్వింటాల్ కి నష్టపోతున్నారన్నారు .
జిల్లాలో ఏ పంట ఎన్ని ఎకరాలలో రైతులు సాగు చేశారు అనే సమాచారం అధికారుల వద్ద ముందస్తుగా ఉన్న పంట చేతికి వచ్చే సమయం అని తెలిసి కూడా కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించా రని అధికారులకు ముందు చూపు లేకపోవడంతో రైతుల ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటివరకు మార్కెట్ యార్డ్ కొచ్చిన మొక్కజొన్న ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసి గోదాములకు తరలించాలని, మొక్కజొన్న కొనుగోలు చేసిన గోదా ములకు తరలించక పోవడంతో రైతులు ఇక్కడే ఉండి పంటకు కాపుల కాయాల్సి వస్తుందని ఆమె వాపోయారు.
అంతేకాకుండా మొక్కజొన్న నింపేందుకు సంచులు సరఫరా చేయకపోవడంతో బయట అధిక ధరలకు రైతులకు కొనుగోలు చేస్తే సగం ధర మాత్రమే రైతులకు చెల్లిస్తున్నారని ఈ విధంగా కూడా రైతులు నష్ట పోతున్నారని అన్నారు. సంచులు హమాలీ లు ,ట్రాన్స్పోర్ట్ లారీలు లేవని అధికారులు చెప్తున్నారు అని రైతులు 15 రోజులు మార్కెట్ యార్డ్ లో ఉంటే వారికి ఎంత నష్టం జరుగుతుంది ఆలోచించండి అన్నారు .సీఎం సొంత జిల్లాలోని ఇటువంటి పరిస్థితి ఉంటే మిగతా జిల్లాల్లో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు .ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే వెంటనే కొనుగోలు పూర్తి చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు .
రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలకి విధమైన తప్ప రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కనీసం మార్కెట్ యార్డ్ లో తాగడానికి నీరు కూడా లేవని వాపోయారు .రైతులకు గిట్టుబాటు ధర కల్పించిందని, కొనుగోలు ఆలస్యం లేకుండా చేయాలని, రైతు లు నష్టపోకుండా బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు బండిల వెంకట్ రాములు మచ్చ పురం రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






