28 April, 2026 | 2:19 AM

వారంలో ఒకరోజు డ్రైడేగా పాటించాలి

28-04-2026 12:03 AM

మేడిపల్లి, ఏప్రిల్ ౨౭ (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 53వ రోజు బోడుప్పల్ సర్కిల్ పరిధి ఫిర్జాదిగూడలోని రామకృష్ణనగర్, బోడుప్పల్‌లోని ఇందిరానగర్ కాలనీల యందు మాస్సివ్ వెక్టార్ కంట్రోల్ యాక్టివిటీస్‌ని విజయవంతంగా నిర్వహించినట్లు బోడుప్పల్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ హాజరై ఇంటి పరిసరాలలో నీటి  నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారంలో ఒకరోజు డ్రైడే గా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఇఇ జాహ్నవి శశాంక్, ఏఇ మహేష్, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు రాంబాబు, నరేష్ రెడ్డి, ఫీల్ అసిస్టెంట్లు, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.