28 April, 2026 | 2:19 AM

నిబద్ధత కలిగిన నాయకులను కోల్పోవడం బాధాకరం

28-04-2026 12:02 AM

బడంగ్‌పేట్  (విజయక్రాంతి) ఏప్రిల్ 27: క్రమశిక్షణ, నిబద్ధత  కలిగిన నాయకులను కోల్పోవడం చాలా బాధాకరమని, అలాంటి వ్యక్తులు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తర్రే మల్లేష్ యాదవ్,  బడం గ్ పేట్ బీజేపీ అధ్యక్షుడు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డిని కోల్పోవడం పార్టీకి తీరని నష్టమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం బడంగ్‌పేట్ సర్కిల్ నాదర్‌గుల్‌లో ఏర్పాటు చేసిన మల్లేష్ యాదవ్, రామకృష్ణ రెడ్డిల సంతాప సభకు బండారు దత్తాత్రేయతో పాటు ఎంపీలు రాజేందర్ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగి రాజ్ భూపాల్ గౌడ్, మాజీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీ అందెల శ్రీరాములు యాదవ్, కోలన్ శంకర్ రెడ్డి హాజరై నివాళులు అర్పించారు.