తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ వైస్ చైర్మన్ శోభారాణి
హనుమకొండ,మే 20(విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో కేటాయించిన విధంగా ఉద్యమకారులకు 250 గ జాల ఇంటి స్థలాలను వెంటనే కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ తమ్మల శోభారాణి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులను సముచిత స్థానం కల్పించి గౌరవించాలన్నారు.
ఉద్యమ కారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేసిన కె.కె కమిటిని పాక్షికంగా ఆమోదిస్తున్నామని, ఇంకా ఈ కమిటీ లో ఉద్యమ సం ఘాల ప్రతినిదులను, మహిళను, విద్యార్థి నాయకున్ని ఇంకా 5 గురిని కమిటీలు చేర్చాలన్నారు. అన్నారు. ఉద్యమ కారులను విభ జించ వలదని అందరికి 250 గజాల ఇంటి స్థలం, 25 వేల గౌరవ పెన్షన్, 100 ఎకరాల్లో అమరుల స్మృతి వనం, గుర్తింపు కార్డు, వ్యాపార నిమిత్తం 50శాతం సబ్సీడి లో కోటి రూపాయలు రుణం, 25 లక్షల సా మాన్య ప్రమాద భీమా, ఉచిత బస్ పాస్, భార్యా భర్తలకు ఇద్దరికీ కార్పొరేట్ వైద్యం ఉండాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్య అతిదిగా హాజరైన టియు జెఎసి చైర్మన్ సుల్తాన్ యాదగిరి మాట్లాడుతు ప్ర భుత్వం కొందరికే ఫలాలు అందించి చేతులు దులుపుకుందామనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్ర భుత్వం మనుగడ సాగించాలన్నా, వచ్చే అన్ని ఎన్నికలలో గెలవాలన్న, ఉద్యమకారు ల సమస్యలు భేషరతుగా పరిష్కరించాలని, ఉద్యమ సంఘాల ప్రతినిధులను, ఉద్యమ కమిటీ అయిన కె.కె కమిటీలో చేర్చాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీయుజెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల యాదగిరి, రాష్ట్ర నాయకులు కె. సత్య, బి. ప్రమదా దేవి, బగ్గుల రమ,కొడేపాక అన్నపూర్ణ, నరేడ్ల విజయ,మాడిశెట్టి అరుంధతి,మారమ్మ తదితరులు పాల్గొన్నారు.






