19 March, 2026 | 10:58 AM

రంజాన్ తోఫా కానుక కాదు.. బాధ్యత

19-03-2026 01:21 AM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్, మార్చి 18 (విజయక్రాంతి): రంజాన్ తోఫా కానుక కాదని ప్రభుత్వ బాధ్యతని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.బుధవారం షాద్నగర్ లో తన క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోఫా పంపిణీ అనేది కేవలం కానుక మాత్రమే కాదని, అన్ని మతాలను గౌరవించాల్సిన ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

నియోజకవర్గానికి 1000, మున్సిపాలిటీకి 250 తోఫాలు మంజూరయ్యాయని, పండుగలోపు అర్హులందరికీ వీటిని అందజేస్తామని తెలిపారు. ఫరూక్ నగర్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనల కోసం అన్ని వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు.నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం, వైస్ చైర్మన్ అందె మోహన్ మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.