ప్రజల విశ్వాసాన్ని నిలబెట్డడంలో.. సీఐఎస్‌ఎఫ్ పాత్ర ఎనలేనిది
- గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఘనంగా ఎన్‌ఐఎస్‌ఏలో పాసింగ్ అవుట్ పరేడ్
జవహర్‌నగర్, జూన్ 13 (విజయక్రాంతి): దేశ జాతీయ ఆస్తుల భద్రతలో, ఆదర్శవంతమైన సేవల్లో సీఐఎస్‌ఎఫ్ పాత్ర మరువలేమని, దేశ సేవలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నిజాయితీ, క్రమశిక్షణ, వృతి నైపు ణ్యం వారి సొంతమని రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా పేర్కొన్నారు. గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర పారిశ్రామిక భద్ర తా దళం ( సీఐఎస్‌ఎఫ్) ప్రముఖ శిక్షణా సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ) హకీంపేటలో శనివారం 39వ బ్యాచ్ అసిస్టెంట్ కమాండెంట్లు 9వ బ్యాచ్ సబ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ ఫెరేడ్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ శివ ప్రతా ప్ శుక్లా హాజరై మాట్లాడుతూ దేశ సేవలో అత్యున్నత స్థాయి నిజాయితీ, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యం అంకితభావాన్ని పాటించాలని సూచించారు. దేశంలో కీలక జాతీయ ఆస్తుల భద్రతను నిర్ధారించడంలో ఆదర్శవంతమైన సేవల ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడంలో సీఐఎస్‌ఎఫ్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఐదు మంది మహిళ అధికారులతో సహా మొత్తం 76 మంది అసిస్టెంట్ కమాండెంట్లు 124 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు( మాజీ సైనికులు) కఠినమైన వృత్తిపరమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి దేశంలోని కీలక ఆస్తులు మౌలిక వస్తువుల భద్రత బాధ్యతలను నిర్వర్తించేందుకు సిద్ధమవడం దేశానికే గర్వకారణం అన్నారు.
అనంతరం పాసింగ్ అవుట్ పెరేడ్‌కు హాజరవుతున్న శిక్షణార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు వారిని అభినందించారు.ఈ పరేడ్‌కు సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ రంజన్, అదనపు డైరెక్టర్ జనరల్ విజయ ప్రకాష్, ఇతర సీనియర్ సీఐఎస్‌ఎఫ్ అధికారులు, పౌర పోలీస్ ప్రముఖులు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, ఆధ్యాపకులు, కుటుంబ సభ్యులు, శిక్షణార్థులు తదితరులు హాజరయ్యారు.






