19 August, 2026 | 10:41 PM

శాతవాహనలో ఆరు నూతన రెగ్యులర్ పీజీ కోర్సులు

19-08-2026 09:14 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం 2026–27 విద్యాసంవత్సరం నుండి  6 నూతన పోస్ట్ గ్రాడ్యుయేషన్  కోర్సులను రెగ్యులర్ విధానంలో ప్రారంభించేందుకు బాటలు పడ్డాయి. ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వ కళాశాల విద్య కమిషనర్ శ్రీమతి ఎ. శ్రీదేవసేన రెగ్యులర్ ప్రాతిపదికన కోర్సులను మంజూరు చేశారు.

నూతన రెగ్యులర్ కోర్సుల వివరాలు: ఎం.బి.ఏ (రిటైల్ మేనేజ్మెంట్) – సీట్లు: 60 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్, కరీంనగర్, ఎం.కామ్ (ఫైనాన్స్ టెక్నాలజీ) – సీట్లు: 40 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్, కరీంనగర్, ఎం.ఎస్సీ (ఫోరెన్సిక్ సైన్స్) – సీట్లు: 30 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, కరీంనగర్, ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్ – సీట్లు: 30 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, కరీంనగర్ ఎం.ఎస్.డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) – సీట్లు: 40 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సోషల్ సైన్స్, కరీంనగర్,ఎం.బి.ఏ (బిజినెస్ అనలిటిక్స్) – సీట్లు: 60 యూనివర్సిటీ పీజీ కాలేజ్, గోదావరిఖని ఈ సందర్భంగా విసి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ బిజినెస్ అనలిటిక్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ , ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ సైన్స్  వంటి ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను రెగ్యులర్ పద్ధతిలో అందించడం ద్వారా గ్రామీణ, స్థానిక విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.