13 July, 2026 | 5:17 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

అమరుల త్యాగాలను స్మరించుకోవాలి

03-10-2024 01:34 AM

టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): పెత్తరమాస సందర్భంగా తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గన్‌పార్క్‌లోని అమరవీ రుల స్థూపం వద్ద అమరవీరులకు బియ్యం సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమరవీరులకు బియ్యం సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ కోసం 650 మంది బలిదానాలు చేసుకున్నారని, మరో 650 మంది ఆవేదనతో మర ణించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వారి త్యాగాలతోనే ఏర్పడిందని, అయితే గత పదేళ్లుగా ఒక కుటుంబం మాత్రమే తెలంగాణ సాధించినట్టు చరిత్రను వక్రీకరించినట్లు పేర్కొన్నారు.

పెత్తరమాససం దర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్య త అన్నారు. టీజేఎస్ నేతలు బైరి రమేశ్, పల్లె వినయ్, సర్దార్ వినోద్ కుమార్, నర్సయ్య, రాంచందర్, హన్మంతు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.