calender_icon.png 22 January, 2026 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాకు వ్యతిరేకంగా బతుకమ్మ ఆట

03-10-2024 01:33:41 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి) : హైడ్రాకు వ్యతిరేకంగా బుధవారం షేక్‌పేట్‌లో మహిళలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ హాజరై మాట్లాడారు. హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలు పంపిణీ ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు కూడా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.