9 July, 2026 | 4:52 PM

ఐదో రోజూ అదే తీరు

30-11-2024 03:18 AM

పార్లమెంట్‌లో కొనసాగుతోన్న వాయిదాల పర్వం

న్యూఢిల్లీ, నవంబర్ 29: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయి దాల పర్వం కొనసాగుతోంది. అదానీ లంచాల అంశంతో పాటు మణిపూర్, సంభాల్‌లో హింసాత్మక ఘటనలు పార్లమెంటును కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నాయి.

ఫలితంగా వరుసగా ఐదో రోజూ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో విపక్షాల డిమాండ్ నడుమ సభ ప్రారంభ మైన గంటకే వాయిదా పడింది. ఆ తర్వాత 11 గంటలకు మళ్లీ ప్రారంభం కాగా పరిస్థితి మారకపోవడంతో సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు.