17 April, 2026 | 3:55 PM

Breaking News

అగ్ని ప్రమాదంలో జొన్న పంటతోపాటు 30 పైపులు దగ్ధం   •   ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి   •   ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు   •   గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న   •   కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •  

సింగిల్ వచ్చేది అప్పుడే

26-04-2025 12:00 AM

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. గీతాఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విద్యా కొప్పినీడి, భానుప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలు. కేతికాశర్మ, ఇవానా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన హిస్టారిక్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. హీరో శ్రీవిష్ణు మే 9న రిలీజైన కల్ట్ సూపర్‌హిట్ సినిమాల గురించి చెప్తుండగా.. చివరలో ఈ చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ ‘జైలర్ హుకుం’ స్టుల్‌లో మే 9న రిలీజ్ డేట్‌ను లాక్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్ రాజ్; సంగీతం: విశాల్ చంద్రశేఖర్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్; ఆర్ట్: చంద్రిక గొర్రెపాటి.