డీసీసీ అధ్యక్షునికి స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
19-07-2026 12:11 PM
బోథ్. జూలై 19( విజయక్రాంతి): మండల కేంద్రానికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ రావడంతో ఆయనను మండల పార్టీ కన్వీనర్ మీరు భోజన్న ఆధ్వర్యంలో ఘనంగా సాధించారు పుష్పగుచ్చాలు అందించి సన్మానించడం జరిగింది. మండల పార్టీ కన్వీనర్ గా మీరు భోజన్న బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా అధ్యక్షుడు మొదటిసారి రావడంతో ఆయన కు ఆత్మీయ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ,రాష్ట్ర సీసీఎల్ ఉపాధ్యక్షులు మహేందర్ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పి చంటి ,ఎస్సీ సెల్ అట్రాసిటీ చైర్మన్ అంజయ్య ,మండల కన్వీనర్ గాజుల పోతన్న, అబ్రార్, కౌసర్, తదితరులు పాల్గొన్నారు.






