19 July, 2026 | 7:05 PM

ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్‌లో బస్వాపూర్ యువకుడి విజయం

19-07-2026 12:02 PM

భిక్కనూర్, జూలై 19(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కసాల సాయి కుమార్ గౌడ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ (AIBE)లో ఉత్తీర్ణత సాధించారు. న్యాయ విద్య పూర్తి చేసిన వారు కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పరీక్షలో విజయం సాధించిన వారికి సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అందజేస్తారు. ఈ విజయంతో సాయి కుమార్ గౌడ్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.