19 July, 2026 | 7:20 PM

పీపీఎల్ ఆవిర్భావ వేడుకలు

19-07-2026 12:07 PM

సిద్దిపేట (విజయక్రాంతి): ప్రోగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ (పిపిఎల్) 5వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మెట్ల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్దిపేట బీజేఅర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన మంద ఆయుష్ వర్ధన్, మహంకాళి సాయి ప్రసన్న, ఇలసాగరం ఆశ్రిత లను సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు.

ఈ సందర్భంగా మెట్ల శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందించేందుకు నిరంతరం పీపీఎల్ ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఏకతాటిపైకి వచ్చేలా కృషి చేస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పీపీఎల్ పోరాటం ఫలితంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యా, భోజనం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులు ఈ సంఘంలో సభ్యత్వం పొంది విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ ప్రతినిధులు వనిత, భాగ్య, జమున, ఎల్లయ్య, రజిని తదితరులు పాల్గొన్నారు.