గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీలు
డాక్టర్ తిరునహరి శేషు :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన మూడవ పూర్తి స్థాయి బడ్జ్పె ప్రజలు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ప్రభుత్వం చెబుతున్నంత గొప్పగా బడ్జెట్ ఏమీ లేదు. బడ్జెట్ కేటాయింపులు అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచినట్లుగానే కనిపిస్తున్నాయి. మా ప్రభుత్వానికి బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు..
ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు అని, బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పునకు దోహదపడే లెక్కలు, తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రం అని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఆచరణలో మాత్రం బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలను, ఎనిమిదవ బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలను, 12వ బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలను అధిగమిస్తే.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3,24,234 కోట్ల రూపాయలతో 13వ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్లను ప్రవేశపెడుతున్నా కేటాయించిన నిధులను పూర్తిస్థాయి లో ఖర్చు చేయకపోవడం వల్ల వాస్తవ ఫలితాలు రావడం లేదు.
గ్యారెంటీలపై స్పష్టత ఏది?
సహజంగా ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు తాము ఇచ్చిన హామీలపై స్ప ష్టత ఇస్తాయని ప్రజలు ఆశిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిందంటే ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ప్రజలకు హా మీగా ఇచ్చిన 6 గ్యారంటీలే కారణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత, నేటి ఆర్థిక మంత్రి ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు పూర్తిస్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టినా 6 గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేకపోతున్నారనేది వాస్తవం. మొదటి బడ్జెట్లో గ్యారంటీల అమలు కోసం 47 వేల కోట్ల రూపాయలను, రెండవ బడ్జె ట్లో 56 వేల కోట్ల రూపాయలను కేటాయిం చి.. మూడవ బడ్జెట్లో కేవలం 50 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. ఈ బడ్జెట్లో 6 గ్యారంటీలకు భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తారని ఆశించారు.
గ్యారంటీల అమలు కోసం అనూహ్యంగా గత బడ్జె ట్ కంటే దరిదాపు 6 వేల కోట్ల రూపాయల నిధులను తగ్గించడం వల్ల ప్రభుత్వంపై అ సంతృప్తి వ్యక్తమవుతోంది. చేయూత పెన్షన్ పెరుగుతుందని ఆశించిన పండుటాకుల ఆశలపై ఆర్థిక మంత్రి నీళ్లు చల్లారు. చేయూ త పెన్షన్లకు గత బడ్జెట్లో 14,861 కోట్ల రూ పాయలు కేటాయించి, ఈ బడ్జెట్లో కూడా అ వే నిధులు కేటాయించి కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు ఎలా మంజూరు చేస్తారనే సందేహాలు కలుగుతున్నాయి.
మహాలక్ష్మి గ్యారెంటీని పూర్తిగా అమలు చేయకుండా ఒక్క ఉచిత బస్సు సౌకర్యంతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే మంత్రదం డం ప్రభుత్వం దగ్గర ఉండటం మహిళా లో కాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వా లు మహిళల ఖాతాలో నెలనెలా నగదు జమ చేస్తుంటే.. తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఆడబిడ్డ నిధి, మహాలక్ష్మి గ్యారంటీల కోసం మహిళలు ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్ర భుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించకుం డా మహిళలను మభ్యపెడుతూనే ఉన్నాయి.
ప్రధాన రంగాలను విస్మరించారు..
బడ్జెట్లో ప్రధాన రంగాలైన వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగాలను, కీలకమైన విద్యా, ఆరోగ్య రంగాలను కేటాయింపుల పరంగా విస్మరించారనే అభిప్రాయం కలుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో వ్యవసా య రంగానికి 49 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే.. గత బడ్జెట్లో 24 వేల కోట్ల రూ పాయలను, ఈ బడ్జెట్లో 23 వేల కోట్ల రూ పాయలను మాత్రమే కేటాయించారు.
అలా గే నీటిపారుదల రంగానికి కూడా గత బడ్జెట్లో 23 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే, ఈ బడ్జెట్లో కేవలం 22 వేల కోట్ల రూ పాయలను మాత్రమే కేటాయించడం వల్ల ఆయా రంగాలపై బడ్జెట్ కేటాయింపులు ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా బడ్జెట్లో విద్యా, వైద్య రంగాలకు తక్కువ నిధు లు కేటాయిస్తున్నాయనే విమర్శలు వివిధ వర్గాల నుంచి వస్తున్నాయి.
2014-15 బడ్జె ట్లో విద్యారంగానికి 10 శాతం నిధులు కేటాయిస్తే ఈ బడ్జెట్లో మాత్రం 8.2 శాతం నిధు లను మాత్రమే కేటాయించారు. కాంగ్రెస్ పా ర్టీ తాము అధికారంలోకి వస్తే విద్యారంగాని కి బడ్జెట్లో 15 శాతం నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణ విద్యా కమిషన్ విద్యారంగానికి బడ్జెట్లో 18 శాతం నిధులు కేటాయించాలని ఇటీవల ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
రాష్ట్రంలో ఉన్న 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా, మన ఊరు మనబడి లక్ష్యా లను సాధించకుండానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు బడ్జెట్లో 5000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఢిల్లీ, బీహార్, అసోం, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో విద్యారంగానికి 18 నుంచి 23 శాతం నిధులు కేటాయిస్తుంటే.. మనం మా త్రం ఏడు లేదా ఎనిమిది శాతం నిధులు కేటాయిస్తూ విద్యకు ఎంతైనా ఖర్చు చేస్తాం, విద్యపై చేసే ఖర్చును పెట్టుబడిగా భావిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు.
మరొక కీలక రంగం ఆరోగ్య రంగానికి కూడా గత బడ్జెట్లో నాలు గు శాతం, ఈ బడ్జెట్లో 4.2 శాతం నిధులను మాత్రమే కేటాయించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కీలకమైన హా మీలను మూడవ బడ్జెట్లో కూడా అమలు చేయలేకపోతే అది ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలి. సంక్షేమ రంగానికి కేటాయించే నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదు.
గత ప్రభుత్వం లాగే కాంగ్రెస్ ప్రభు త్వం కూడా కేటాయిస్తున్న నిధుల పరంగా చూస్తే బీసీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ప్రతి బడ్జెట్లో బీసీల సంక్షే మానికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామనేది కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పొందు పరిచిన ప్రధాన హామీ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో ఆ మేరకు నిధులు కేటాయించలేదు, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. మూడు బడ్జెట్లలో బీసీల సంక్షేమానికి వరుసగా 9, 11, 12 వేల కోట్ల రూపాయల నిధు లను మాత్రమే కేటాయించారు.
మెప్పించని కొత్త పథకాలు
బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం లాంటి కొత్త పథకాలను ప్రకటించినప్పటికీ ఆ పథకాలు ఆకట్టుకోలేకపోయాయి. ఇందిరమ్మ కుటుం బ జీవిత బీమాను ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, జీవించడం ఒక వరం అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఈ పథ కం కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రాజీవ్ యువ వికాసం పథకాల లాగా మా రకూడదని ప్రజలు ఆశిస్తున్నారు.
మధ్యా హ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్‌తో పాటు 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు కూ డా వర్తింపజేస్తే బాగుండేదనే అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. గరికపాటి నరసింహారావు ప్రవచనం ప్రకారం అయితే మధ్యా హ్న భోజన పథకం, అందులో కోడిగుడ్డు దండగే. ఈ బడ్జెట్లో మూలధన వ్యయం 47 వేల కోట్ల రూపాయలుగా నిర్ణయించడం ఆ హ్వానించదగ్గదే.
అయితే 2028 నాటికి 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాలనే లక్ష్యం చేరుకోవడం దాదాపు అసాధ్యం గా కనిపిస్తోంది. ఆత్మస్తుతి పరనింద.. అనే పద్ధతిలో భాగంగా గత 27 నెలలుగా అప్పులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు పెద్దగా విశ్వసించడం లే దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలలో చేసిన అప్పు 3,47,294 కోట్ల రూ పాయలు. ఇది ఈ బడ్జెట్ వ్యయం 3,24,234 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కావడం గమనార్హం.
- వ్యాసకర్త సెల్: 98854 65877




