23 March, 2026 | 8:02 PM

భారత ఇంధన భద్రతకు ముప్పు

22-03-2026 12:00 AM

వెంకగారి భూమయ్య :

భారతదేశ ఇంధన రంగంలో గ్యాస్ సిలిండర్ (ఎల్పీజీ) ఒక విడదీయలేని భాగం. ముఖ్యంగా ‘ప్రధానమం త్రి ఉజ్వల యోజన’ వంటి ప్రతిష్ఠాత్మక పథకాల ద్వారా దేశవ్యాప్తంగా పది కోట్లకు పైగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందాయి. నేడు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 60 లక్షల సిలిండర్లు వినియో గం ఉంటుంది. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద గృహ వినియోగదారుల సమూహాల్లో ఒకటి. అయితే, ఈ పొయ్యిల వెనుక ఒక భయంకరమైన సత్యం దాగి ఉంది.

ప్ర స్తుతం దేశం ఎదుర్కొంటున్న గ్యాస్ సిలిండర్ కొరత, సరఫరాలో తలెత్తుతున్న ఆటం కాలు మన దేశ ‘ఇంధన భద్రత’లోని ఘోరమైన లోపాలను వేలెత్తి చూపుతున్నాయి. ప్ర భుత్వం దీనిని ఆందోళనకరమైన పరిస్థితిగా గుర్తించి, బుకింగ్ పద్ధతులను కఠినతరం చేయడం, అత్యవసర వస్తువుల చట్టాన్ని అ మలు చేయడం వంటి తక్షణ చర్యలకు ఉపక్రమించడం మన పరిస్థితి ఎంత దారు ణంగా ఉందో అర్థం పడుతోంది. మన దేశానికి అవసరమైన వంట గ్యాస్‌లో 60 శాతా నికి పైగా కేవలం దిగుమతుల ద్వారానే వస్తోంది.

అందులోనూ ఆశ్చర్యకరమైన విష యం ఏమిటంటే, ఈ దిగుమతుల్లో 90 శా తం ఒక్క మధ్య పశ్చిమాసియా దేశాల నుం చి వస్తున్నాయి. భౌగోళిక రాజకీయంగా ఎప్పుడూ ఉద్రిక్తతలు నెలకొనే ‘హోర్ముజ్ జలసంధి’ వంటి వివాదాస్పద జలసంధి ద్వారా ఈ సరఫరా జరుగుతుండటం భారత్‌కు పెద్ద సవాలు. అంతర్జాతీయంగా ఏ చి న్న యుద్ధ మేఘాలు కమ్మినా లేదా ఆ స ముద్ర మార్గంలో నౌకల రాకపోకలకు ఆ టంకం కలిగినా, మన దేశంలోని కోట్ల మం ది ఇళ్లలో వంట నిలిచిపోయే ప్రమాదం ఉం ది.

మనం ఇంధన ఉత్పత్తిలో స్వయం సమృ ద్ధి సాధించకుండా, కేవలం ఒకే ప్రాంతంపై, అది కూడా అస్థిరమైన రాజకీయ పరిస్థితు లు ఉన్న దేశాల పైన ఆధారపడటం అనేది పాలకుల దూరదృష్టి లేమికి నిదర్శనమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం.

15 రోజుల నిల్వతో దేశం భద్రమేనా?

చమురు నిల్వలకు ఉన్నట్లుగా, వంట గ్యాస్ కోసం మన దేశంలో ఎలాంటి వ్యూ హాత్మక నిల్వ కేంద్రాలు లేకపోవడం విచారకరం. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వద్ద ఉన్న నిల్వలు కలిపినా కేవలం 15 రో జుల వినియోగానికి మాత్రమే సరిపోతాయి. అంటే, ఏవైనా కారణాల వల్ల దిగుమతులు నిలిచిపోతే, కేవలం రెండు వారాల్లోనే దేశం మొత్తం అంధకారంలోకి లేదా ఆకలి చావుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఈ నిల్వలు ఏమాత్రం చాలవు.

ఒక పటిష్టమైన ఇంధన భద్రతా ప్రణాళికలో భాగంగా కనీసం 45 రోజుల అవసరాలకు సరిపడా భూగర్భ లేదా ఉపరితల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. దీని కోసం వేల కోట్ల పెట్టుబడి అవసరమైనప్పటికీ, దేశ ప్రజల ప్రాథమిక అవసరాల ముం దు ఇది చాలా స్వల్పం. ఒక్క రోజు నిల్వ సామర్థ్యం పెంచుకోవడానికి సుమారు రూ. 2,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా. కానీ భవిష్యత్తులో వచ్చే సంక్షోభాల ఆర్థిక నష్టం దీనికంటే వేల రెట్లు ఎక్కువగా ఉం టుంది.

గ్యాస్ కొరత ప్రభావం దేశంలోని మారుమూల గ్రామాల వరకు చేరింది. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభు త్వం ఇతర దేశాలతో దీర్ఘకాలిక ఒప్పందాలను కుదుర్చుకోవాలి. సముద్ర మార్గాల్లో మన నౌకలకు పటిష్టమైన రక్షణ కల్పించేలా నౌకాదళం పహారా పెంచాలి. దేశీయంగా బయో-గ్యాస్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తిని ప్రోత్సహించాలి.

చెత్త నుంచి విద్యుత్ లేదా గ్యాస్ తయారు చేసే చిన్న తరహా పరిశ్రమలను ప్రతి మండలానికి విస్తరించాలి. తద్వారా స్థానిక అవసరాలను స్థానికంగానే తీర్చుకునే వీలుంటుంది. ఇంధ న స్వయం సమృద్ధి అనేది కేవలం ఒక నినాదంగా మిగిలిపోకుండా, పటిష్టమైన కార్యా చరణతో ముందుకు సాగితేనే రాబోయే తరాలకు ఇంధన భద్రత అందించగలం.

ప్రత్యామ్నాయం ఎక్కడ?

కేవలం మధ్య ప్రాచ్యంపైనే కాకుండా, ప్రపంచంలోనే గ్యాస్ ఉత్పత్తిలో అగ్రస్థానం లో ఉన్న అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులను పెంచుకోవడం ద్వారా ప్ర మాదాన్ని తగ్గించుకోవచ్చు. అమెరికా నుం చి రావడానికి నౌకలకు సుమారు 45 రోజు ల సమయం పట్టినప్పటికీ, వివిధ దేశాల నుంచి సరఫరా మార్గాలను కలిగి ఉండటం ద్వారా ఏదైనా ఒక ప్రాంతంలో సంక్షోభం తలెత్తినా మన దేశీయ అవసరాలకు ఆటం కం కలగదు. మన శుద్ధి కర్మాగారాలు అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్నప్పటికీ, ముడి చమురు నుంచి వచ్చే గ్యాస్ ఉత్పత్తి కేవలం 3-5 శాతానికి మించడం లేదు. అం దుకే దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలి.

స్వదేశీ వనరులే శరణ్యం

గ్యాస్ కొరతను అధిగమించాలంటే కేవ లం దిగుమతులపై దృష్టి పెడితే సరిపోదు. మన దేశంలో లభ్యమయ్యే సహజ వాయు వు వినియోగాన్ని గృహ అవసరాలకు మ ళ్లించాలి. ముంబై తీరం, కృష్ణా-గోదావరి బేసిన్, రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి వస్తున్న గ్యాస్ను పైపుల ద్వారా నేరుగా ఇళ్లకు పైపుల ద్వారా చేరవేయాలి. దీనివల్ల సిలిండర్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, గ్యాస్ వృధాను అరికట్టవచ్చు.

వీటికి తోడు, భవిష్యత్తులో ఇంధన స్వయం సమృద్ధి సాధించడానికి ‘విద్యుత్ పొయ్యిల’ వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఇది ప్రస్తుతం కొంచెం ఖరీదైనదిగా అనిపించినా, విదేశీ గ్యాస్‌పై ఆధారపడకుండా ఉండటానికి ఇదొక్కటే శాశ్వత మార్గం. సౌర విద్యుత్ ద్వారా ఈ పొయ్యిలను నడిపించేలా సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి.

మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది

గోతిలో పడ్డ ఆవును బయటకు తీయడమే కాదు, అది మళ్ళీ గోతిలో పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే సరైన నిర్వహణ అన్న నిర్వహణ పాఠం మన పాలకులకు తెలియంది కాదు. ప్రభుత్వం కేవలం తాత్కాలికంగా బుకింగ్‌లను నియంత్రించడంతో లేదా చట్టాలను కఠినతరం చేయ డంతో సరిపెట్టకూడదు. ఇది కేవలం ఒక పూట సమస్య కాదు, దేశ భవిష్యత్తుకు సం బంధించిన అంశం. పటిష్టమైన ఇంధన విధానాన్ని రూపొందించి, నిల్వ సామర్థ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన పెంచుకోవాలి.

వంట గ్యాస్ రవాణాలో వాడే నౌకలకు రక్ష ణ కల్పించడం నుంచి, కొత్త మార్గాలను అన్వేషించడం వరకు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అప్పుడే పది కోట్ల భారతీ య కుటుంబాల వంటగది భద్రంగా ఉం టుంది. పాలకుల అజాగ్రత్త ఇలాగే కొనసాగితే, రేపు దేశం మొత్తం తీరని ఇంధన సం క్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. దేశ ప్రజల ఆకలిని తీర్చే పొయ్యి ఆరిపోకముందే మేల్కొనడం అత్యవసరం.

 వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, 

సెల్: 9848559863