1 June, 2026 | 2:10 AM

వెట్టిచాకిరి నిర్మూలనలో ‘ఐనాల’పోరాట స్ఫూర్తి

01-06-2026 01:24 AM

మరిపెడ (మహబూబాబాద్) మే 31 (విజయక్రాంతి): వెట్టిచాకిరి నిర్మూలనలో ఐనాల వారి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఐనాల సైదులు పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో ఐనాల వారి ఆత్మీయ సమ్మేళనం ఐనాల బిక్షం అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమానికి తెలంగాణ ఇంతలేక్చువల్ పోరం రాష్ట్ర కార్యదర్శి ఐనాల సైదులు, స్పాట్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐనాల పరశురాములు పాల్గొని మాట్లాడుతూ బారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఐనాల వారి త్యాగాలు స్పూర్తి దాయకంగా నిలుస్తాయన్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వెట్టిచాకిరి నిర్మూలన పోరాటాల్లో ఐనాల వారి పాత్ర మరువలేనిదని, నిజాం పరిపాలనంలో రజాకార్ల ఆగడాలకు, ప్రజలను ఏకంచేసి ఎదిరించిన ఐనాల వెంకయ్య ఆత్మగౌరవ ఉద్యమం నేటి తరానికి ఆదర్శమన్నారు. తెలంగాణ గడ్డమీద జరిగిన స్వాతంత్య్ర పోరాటంతో పాటు దళిత చైతన్య సామాజిక ఉద్యమాల్లో ఐనాల వారి చరిత్ర వెలికితీయాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరువూరు, కాకర్ల, తెలంగాణ లోని ఖమ్మం, కేజీ సిరిపురం, అమ్మపాలేం, పినపాక, పాతర్లపాడు, మహబూబాబాద్ జిల్లాలోని ఎల్లంపేట,మరిపెడ ,చిల్లంచర్ల, నేరడ,అబ్బాయిపాలెం, కంబాలపెల్లి, ఉగ్గంపల్లి, చిన్న నాగారం, సూర్యాపేట జిల్లాలోని కుక్కుడం తదితర ప్రాంతాలనుండి సుమారు 1,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట నిర్వహణ కమిటీ సభ్యులు  ఐనాల బిక్షం, ఐనాల నవీన్, ఐనాల మైసయ్య, ఐనాల చిన్న ముత్తయ్య, ఐనాల మధు, ఐనాల వెంకన్న, ఐనాల బాబు, ఐనాల వీరస్వామి, ఐనాల కృష్ణ, ఐనాల పుల్లయ్య, ఐనాల నర్సయ్య, ఐనాల రాజేష్, ఐనాల ఉదయ్, ఐనాల శశివర్మ, ఇసంపల్లి వెంకన్న, ఐనాల రాము తదితరులు పాల్గొన్నారు.