16 April, 2026 | 10:20 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఘాటి వచ్చేది అప్పుడే

03-06-2025 12:00 AM

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఘాటి’. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని జూలై 11న విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి.

సాయిమాధవ్ బుర్రా మాటలు రాసిన ఈ చిత్రానికి మనోజ్‌రెడ్డి కాటసాని సినీమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా, చాణక్యరెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.