16 April, 2026 | 11:53 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

తెలుగులోకి డేంజర్ బాయ్స్

03-06-2025 12:00 AM

కన్నడలో ‘అపాయవీడి హెచ్చరిక’ పేరుతో రూపొందిన చిత్రం ఇప్పుడు తెలుగులో ‘డేంజర్ బాయ్స్’ టైటిల్‌తో వస్తోంది. దర్శక నిర్మాత శ్రీరంగం సతీశ్‌కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రీ -రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే మరో ‘మంజుమ్మల్ బాయ్స్’ అవుతుందని పిస్తోందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు.

దీనికి సీక్వెల్ చేస్తున్నామని, ఏకకాలంలో కన్నడ, తెలుగులో తెరకెక్కిస్తామని మేకర్స్ ప్రకటించారు. యశస్విని క్రియేషన్స్, గీతా ఫిలిమ్స్ పతాకాలపై వీజీ మంజునాథ్ - పూర్ణిమ ఎం గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం, డీవోపీ: సునాద్ గౌతమ్; రచనాదర్శకత్వం: అభిజిత్ తీర్ధహళ్లి.