5 September, 2026 | 5:50 AM

హామీలు అమలయ్యే వరకు పోరాటం

05-09-2026 | 05:00am

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్, సెప్టెంబర్- 4 : కెసిఆర్ కిట్టు తో పాటు అందులో ఉన్న గిలకను కూడా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎత్తుకెళ్లారని మాజీ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు. శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గం(Vikarabad constituency)లోని మర్పల్లి మండల కేం ద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్(Methuku Anand) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా వి భాగం నిరసన ర్యాలీ, వంటవార్పు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడు తూ  కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. 

మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సా యం, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వ డం ఏమైందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు.   మహిళలు, దివ్యాంగులు, వృద్ధుల పరిస్థితి రాష్ట్రంలో అధ్వానంగా మారినట్లు తెలి పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందన్నారు.

మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైందని, గర్భిణీలకు అండగా నిలిచిన కేసీఆర్ కిట్ ఎందుకు నిలిపివేశారని, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద తులం బంగారం హామీ ఎందుకు అమలు చేయడం లేదని,ఇంటర్ దాటిన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న యూత్ డిక్లరేషన్ ఏమైందిని ప్రశ్నించారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ వెయ్యి రోజులైనా ఒక్క మహిళా పథకాన్ని సరిగా అమలు చేయని ప్రభుత్వ తీరుకు ఈ వంటా వార్పు నిరసన అద్దం పట్టనుందన్నారు. మహిళా పథకాల అమలులో ప్రభుత్వం తీవ్ర  నిర్లక్ష్యం చేయడంతో ప్రభుత్వం పై మహిళలు కోపంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  వికారాబాద్  సీనియర్ నాయకులు విజయ్ ఆర్య, స్టేట్ జనరల్ సెక్రటరి  నాగేందర్ గౌడ్, రాష్ట్ర బీసీ  కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు