18 July, 2026 | 12:45 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

మొండికేస్తున్న మిల్లర్లు

18-03-2025 01:27 AM
  • సీఎంఆర్ బియ్యం ఇవ్వడంలో  తీవ్ర అలసత్వం
  • ముగిసిన గడువు 2023 రబీ సీజన్ సీఎంఆర్ 
  • బకాయిలు సుమారు 57వేల మెట్రిక్ టన్నులు

సూర్యాపేట, మార్చి 17 (విజయక్రాంతి): కస్టమ్ మిల్లింగ్ రైస్పు మిల్లర్లు మొండికేస్తున్నారు. గడువు దాటినా తమకు కేటాయించిన లక్ష్యాన్ని తిరిగి ఇవ్వడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభు త్వం పలుమార్లు గడువులను పొడిగించినా ప్రయోజనం లేకుండా పోతుండటమే కాకుండా జిల్లాలో ప్రతి సీజన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది.

ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ఇవ్వకుండా సొంత వ్యాపారం చేయడంతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని సమాచారం. 202324 రబీ (యాసంగి)కి సంబంధించి ఇంకా 35 శాతానికి పైగా బియ్యం రావాల్సి ఉంది. మిల్లర్ల వైఖరి కారణంగా జిల్లాలో నాలుగైదు నెలలుగా బియ్యం నిల్వలు లేక.. రేషన్ కూడా ఆలస్యమవుతోంది.

లక్ష్యం 1,62,140 మెట్రిక్ టన్నులు..

202324 రబీ సీజన్లో జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి 49 మిల్లులకు ధాన్యాన్ని కేటాయించారు. ఈ ధాన్యాన్ని మూడునెలల లోగా మరాడించి తిరిగి పౌరసరఫరాల శాఖకు అందించాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,62,140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ధాన్యాన్ని కేటాయించి ఏడాది కావొస్తున్న లక్ష్యంలో ఇంకా 35 శాతం మేర బకాయి ఉంది.

ఈ బియ్యం రాబట్టేందుకు ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగించినా లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మిల్లర్లు మొండికేస్తున్నారు. ఇప్పటి వరకు 1,04,143 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు తిరిగి ఇచ్చేయగా.. మరో 57,997 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడ్డారు.

ముగిసిన గడువు

జిల్లాలో సీఎంఆర్ బియ్యం విషయంలో ప్రతి సీజన్లో మిల్లర్లు మాయాజలం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యాన్ని సమయానికి మర ఆడించి తిరిగి ఇవ్వడం లేదు. ఈ విషయంలో కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున అక్రమాలు సైతం చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం ఇచ్చిన మూడునెలలకే బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది.

202324 యాసంగి సీజన్కు ఇప్పటివరకు ప్రభుత్వం మూడుసార్లు గడువును పొడిగించింది. అయినా జిల్లాలోని 11 మిల్లులు మాత్రమే పూర్తిస్ధాయిలో బియ్యాన్ని తిరిగి ఇచ్చేశాయి. మిగతా వాటిలో 38 మిల్లులు 90 శాతానికి పైగా ఇవ్వగా.. మరో 11 నుంచి 12 మిల్లుల నుంచి పెద్ద ఎత్తున సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉంది. సీఎంఆర్ బియ్యం సేకరణలో అధికారులు నిత్యం తనిఖీలు, సమీక్షలు చేపడుతున్నా.. మొండికేస్తున్నారు. కాగా  ఈ నెల 17తో గడువు ముగిసింది.