25 May, 2026 | 5:37 PM

నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

13-12-2024 11:28 PM

ఐటీడీఏ పీవో రాహుల్... 

మణుగూరు: నిరుద్యోగ గిరిజన యువకులు సమయాన్ని వృధా చేయకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సూచించారు. శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని గౌతపురం కాలనీలోని ఐటిసి మిషన్ సునరకల్ స్కిల్ డెవలప్మెంట్ ఒకేషనల్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం యువకులకు అందిస్తున్న విద్యుత్ వస్తువుల మరమ్మత్తుల శిక్షణ లోని స్కిన్ డెవలప్మెంట్ శిక్షణల గురించి ఐటిసి జనరల్ మేనేజర్ చంగల్ రావుని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో రాహుల్ మాట్లాడుతూ.. గిరిజన నిరుద్యోగ యువకులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో పాటు 60 రోజుల పాటు ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ శిక్షణ శ్రద్ధగా నేర్చుకోవాలని సూచించారు. ఐటీసీ ద్వారా అందించే కరెంటు శిక్షణ తీసుకొని తమ కుటుంబాలను పోషించుకోవడమే కాక పదిమందికి జీవనాధారం కల్పించేలా చూడాలని అన్నారు.

కరెంట్ రిపేర్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలని, రిపేరు చేసేటప్పుడు రక్షణ కవచాలు చెప్పులు, బ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం కనబరిచిన తప్పనిసరిగా ప్రమాదం కొనితెచ్చుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటి, రెండు నెలలు శిక్షణ తీసుకున్న యువకులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, నరేష్ కుమార్ సెంటర్ హెడ్, శిక్షకుడు శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ అజయ్ కుమార్, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ జోష్ణ దేవి, ఇబ్బంది బలరాం, సుమన్, శిక్షణ తీసుకున్న యువకులు తదితరులు పాల్గొన్నారు.