25 May, 2026 | 5:01 PM

జిల్లా అధ్యక్షులుగా కోట రవికుమార్

13-12-2024 11:24 PM

ఇల్లెందు (విజయక్రాంతి): తెలంగాణ తాహసిల్దార్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ఇల్లందు తహశీల్ధార్ కోట రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కొత్తగూడెంలో జరిగిన జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోట రవికుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి, సంఘ బలపేతానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం గురించి ప్రభుత్వం తీసుకోబోతున్న పలు నిర్ణయాలను స్వాగతిస్తూ సమావేశంలో జిల్లా కమిటీ తీర్మానం చేసిందన్నారు. ఇల్లందు తహశీల్ధార్  కోట రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం పట్ల ఇల్లందు పట్టణ ప్రముఖులు అభినందిచారు.