25 May, 2026 | 5:24 PM

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ ప్రతినిధి బృందం భేటీ

25-05-2026 04:54 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీపీఐ నాయకులు, శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు నేతృత్వం లో ఆ పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని( Chief Minister Revanth Reddy) కలిశారు.  ఇటీవల ప్రజా ప్రభుత్వం తీసుకున్న కనీస వేతనాల  పెంపు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన సీపీఐ నేతలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 

కేంద్రం సహకరించక పోయినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి వారికి వివరించారు. మొక్కజొన్న ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చిందని, కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయక పోయినా, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని నేతలకు సీఎం సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ శాసన మండలి సభ్యుడు సత్యం, పశ్య పద్మ , ఈ.నరసింహ, మాజీ శాసన సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, బాగం హేమంతరావు, శంకర్, బాల నరసింహ, వీఎస్ బోసు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.