గడువులోగా యూనిఫాం వస్త్రం ఇవ్వాలి

24-04-2024 12:07:14 AM

టెక్స్‌టైల్ పార్క్‌లో  సిరిసిల్ల కలెక్టర్ పరిశీలన

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): నిర్దేశిత గడువులోగా పాఠశాల యూనిఫాం బట్టను అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. జిల్లాలోని టెక్స్‌టైల్ పార్కులో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు కుట్టించే యూనిఫాం వస్త్రాన్ని ఉత్పత్తి చేసే పరిశ్రమలో మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. వస్త్రం తయారీలో వివిధ దశలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యత వివరాలు తెలుసుకున్నారు. కార్మికులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ బట్టను ఉత్పత్తి చేసి గడువులోగా యూనిఫాం కుట్టించేందుకు అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల లు, హస్టళ్లలో చదివే విద్యార్థులకు 1,15,816 యునిఫాంలు కుట్టించనున్నారు. మహిళా సంఘాల బాధ్యులు 768 మందికి ఉపాధి లభించనుంది. కార్యక్రమంలో టెక్స్‌టైల ఆర్డీ డీ అశోక్‌రావు, ఏడీ సాగర్ , డీఆర్డీఓ శేషాద్రి, డీఈఓ రమేష్‌కుమార్ పాల్గొన్నారు.