29 April, 2026 | 1:35 PM

కాంగ్రెస్‌తోనే అణగారిన వర్గాల అభ్యున్నతి

11-05-2024 12:10 AM

స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హనుమకొండ, మే 10 (విజయక్రాంతి): కాంగ్రెస్‌తోనే అణగారిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లాకేంద్రంలోని కంచరకుంటలో శుక్రవారం వరంగల్ పశ్చిమ, పరకాల, స్టేషన్ ఘన్‌పూర్, వర్థన్నపేట నియోజకవర్గాలకు చెందిన పాస్టర్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదల కష్ట సుఖాలు పక్కనపెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుందని ఆరోపించారు. 13న ఓటర్లంతా కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే రాజ్యాంగాన్ని కాపాడిన వారమవుతామని అభిప్రాయపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.