మంత్రులం, ఎమ్మెల్యేలం కావాలని మాకు లేదు
మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు.. నేను అడగలేదు
హైదరాబాద్: నాంపల్లిలో తెలంగాణ జన సమితి(Telangana Jana Samithi) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. TJS 8వ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం(Professor Kodandaram) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో నిరంకుశ పాలన అంతం అయి, ప్రజాపాలన రావాలని కొరుకున్నామని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని వెల్లడించారు.
రాష్ట్రంలో టీజేఎస్ పాల్గొనని ప్రజాపోరాటాలు లేవని కోదండరాం తెలిపారు. మంత్రులం, ఎమ్మెల్యేలం కావాలని తమకు లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు.. తాను అడగలేదన్నారు. అవసరమైనప్పుడు ప్రజలకు తోడుగా ఉన్నామని చెప్పారు. మే 21న జరిగే ప్లీనరీలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కుటుంబ పార్టీ లోపాలను కవిత బయట పెడుతున్నారని కోదండరాం వెల్లడించారు. పార్టీ అంటే కుటుంబమే అని కవిత చెప్పకనే చెప్తున్నారని కోదండరాం ఆరోపించారు.






