27 April, 2026 | 1:57 PM

మెదక్‌లో ఎగిరేది గులాబీ జెండానే

11-05-2024 12:08 AM

బీఆర్‌ఎస్ నేత గూడెం యాదమ్మ

పటాన్‌చెరు, మే 10: జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండా అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ మెదక్ లోక్‌సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా శుక్రవారం పటాన్‌చెరు మండలం నందిగామ, భానూర్ గ్రామాలలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకం సన్నగిల్లిందన్నారు.

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మారెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ రోజాబాల్‌రెడ్డి, గుమ్మడిదల ఎంపీపీ ప్రవీనభాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న, భారతీనగర్ కార్పొరేటర్ సింధు, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప తదితరులు పాల్గొన్నారు.