15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కొట్టుకుపోయిన అడవి సోమనపల్లి మానేరు చెక్ డ్యామ్..

17-12-2025 04:42 PM

చెక్ డ్యాం కొట్టుకుపోయిందా.. ధ్వంసం చేశారా!

మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ శివారులో ఉన్న మానేరులోని చెక్ డ్యాం కొట్టుకుపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. అడవి సోమన్ పల్లి మానేరులో గత ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. ఈ చెక్ డ్యాంతో రైతులకు రెండు పంటలకు నీరు నిల్వ ఉండడానికి నిర్మించారు. బుధవారం ఉదయం చెక్ డ్యాం నీటిలో  కొట్టుకుపోయి, నీరు కిందికి పోతుండడంతో స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. 

కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాం ఇలా వరదకు కొట్టుకపోవడంతో ఆ నిధులు నీళ్లపాలు అయ్యాయని  స్థానికుల తెలిపారు. అసలు ఈ చెక్ డ్యాం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందా లేక ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారా అని రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని చెక్ డ్యాం ఎలా కొట్టుకుపోయిందని విచారణ చేపట్టుతున్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా తర్వాత చెప్పుదామని దాటవేశారు.